ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు
13-03-2026 05:59 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణకు కళాశాల సిబ్బంది ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.
పరీక్షా కేంద్రంలో నియమ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. పరీక్షల సమయంలో అధికారులు పర్యవేక్షణ నిర్వహించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. చివరి రోజు కూడా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి పూర్తి చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. శేషుబాబు వెల్లడించారు.




