ఎస్సీ హోదా కోసం పోరాటం తప్పనిసరి
- క్రైస్తవ సమాజంలో రాజకీయ, సామాజిక చైతన్యం పెరగాలి
- మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): దళిత క్రైస్తవులపై జరుగుతున్న సామాజిక, పరిపాలనా వివక్షను ఎదుర్కొనేందుకు ప్రార్థనతో పాటు సంఘటిత కార్యాచరణ, రాజకీయ చైతన్యం అవసరమని మాజీ డీజీ పీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. క్రిస్టియన్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్(సీసీసీ) (Christian Co-ordination Council) తెలంగా ణ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లో ని ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజీలో సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశానికి బక్క పరంజ్యోతి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు మతం మారినంత మాత్రాన వారి సామాజిక స్థితి, కుల వివక్ష అంతరించిపోదని అన్నారు. కేం ద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రాల్లో ఏ పా ర్టీ అధికారంలో ఉన్నా దళిత క్రైస్తవుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించే రాజకీయ సంకల్పం కనిపించడం లేదని విమర్శించా రు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలా ది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న సమస్యపై రాజకీయ పార్టీలు ఎన్నికల సమయం లో ఓట్లు కోరడం తప్ప బలమైన ఉద్యమా లు చేపట్టడం లేదన్నారు. సీసీసీ కమిటీని చురుకుగా మార్చాలని, దళిత క్రైస్తవుల సమస్యలపై సమాచారం సేకరణ,
బాధితులకు న్యాయ సహాయం, ప్రజా అవగాహన, మీడి యా ప్రచారం చేపట్టాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ ఎన్‌ఏడీ పాల్, బిషప్ డొ క్కా డేనియ ల్, బ్యాంకు రిటైర్డ్ ఏజీఎం అశోక్ కుమార్, ప్రభుదాస్, పాస్టర్ ప్రకాష్ రావు, దయానం ద గురువు, రాష్ట్ర, జిల్లా నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు.






