16 July, 2026 | 1:21 AM

షెడ్యూల్ ఏరియాలో చట్టాలను అమలు చేయాలి

16-07-2026 01:20 AM

వెంకటాపురం (నూగూరు), జూలై 15 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగ బద్ద పాలన కొనసాగించడంలో వివక్షత చూపుతున్నారని, షెడ్యూల్ ఏరియాలో చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన ములుగు జిల్లా కన్వీనర్ కుంజ మహేష్ పేర్కొన్నారు. కొండాపురం గ్రామంలో మంగళవారం పెసా గ్రామసభ నిర్వహించి, పెసా గ్రామసభ తీర్మాణాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కు అందజేసినట్టు తెలిపారు.

ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ షెడ్యూల్ చట్టాలను ఉల్లాంఘించే విధంగా ఉందని ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని భావించిన ఆదివాసీలు పెసా గ్రామసభ నిర్వహించినట్లు చెప్పారు.రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ ట్రైబల్స్ దక్కాలసిన రాజ్యాంగ ఫలాలను దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండాపురం ఆదివాసీలు తమ స్వయం నిర్ణయాధికారాన్ని పెసా గ్రామసభ ద్వారా రాజ్యాంగ బద్దంగా ప్రకటించు కున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల అధ్యక్షులు మొడెం నాగరాజు కొండాపురం గ్రామ ఆదివాసీలు పాల్గొన్నారు.