6 May, 2026 | 5:11 PM

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ

06-05-2026 04:40 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కార్పొరేషన్లకు నామినేటెడ్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలను వెల్లడించారు. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 11 వైస్ ఛైర్మన్లను ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు పదవిలో కొనసాగనున్నారు.

కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

1.బ్రాహ్మణ సంక్షేమ పరిషత్: బసవరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్

2. రజక సహకార కార్పొరేషన్: డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్, బంగారు బాబు

3.గౌడ సహకార కార్పొరేషన్: మోటుకూరి చంద్రశేఖర్ గౌడ్, కేసం నాగరాజు గౌడ్

4.పెరిక సహకార కార్పొరేషన్: దొంగరి వెంకటేశ్వర్లు, బూడగం శ్రీనివాస్

5. మేర సహకార కార్పొరేషన్: సంగ వెంకటరాజం, ఎం. లక్ష్మీ నారాయణ

6. వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్: గట్టు తిమ్మప్ప, బోయ నాగేష్

7. మున్నూరు కాపు సహకార కార్పొరేషన్: బొమ్మ శ్రీరామ్, అల్లం భాస్కర్

8. యాదవ సహకార కార్పొరేషన్: ఎం. రఘునాథ్ యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్

9.వడ్డెర సహకార కార్పొరేషన్: గుంజ రేణుక నారాయణ, బత్తుల వెంకటేష్

10.చేనేత అభివృద్ధి సంస్థ (THDC): దూడెం వెంకటరమణ, జక్కని అనిత

11.కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్: బండి రమేష్, పరుచూరి మురళి