2 May, 2026 | 8:49 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •  

ప్రకృతి వ్యవసాయానికి చేయూతనందిస్తా

16-03-2026 12:13 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, మార్చి 15: ప్రకృతి వ్యవసాయానికి తన సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా అందేలా సహకరిస్తానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ లోని రైస్ మిలర్స్ అసోసియేషన్ భవనంలో  జి హెచ్ ఆర్ హోండా షో రూమ్ సౌజన్యంతో సిరి ఫౌండేషన్ ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మాట్లాడారు.

రోజు రోజూకు వాతావరణం లో మార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగా, నేలలకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలన్నారు. ప్రస్తుత రోజులలో రసాయన సాగుతో నేల సారం దెబ్బతింటున్నదన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం ఒక ప్రత్యేక విధానం తేవడానికి కృషి చెస్తానని హామీనిచ్చారు.కోదాడ పట్టణంలో మిద్దె తోటల సాగు అభివృద్ధికి తనవంతు కృషి చేస్థానన్నారు.

నకిరేకల్ ఏ డి ఏ ఎం డి జానిమియా, ఖమ్మం జిల్లా ప్రకృతి రైతు కుడుముల వెంకట రామి రెడ్డి ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు, ఖమ్మం కు చెందిన కొణిదెనా శ్రీనివాస్ మిద్దె తోటల సాగులో మెలకువలు వివరించారు. అనంతరం కోదాడ, హుజుర్నగర్ డివిజన్ ల లోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న, మిద్దె తోటలు సాగు చేస్తున్న, రైతులకు సేవ చేస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో  కోదాడ 12 వ వార్డు కౌన్సిలర్ గుండపునేని పద్మావతి నాగేశ్వరావు, సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మొలుగూరి గోపయ్య, సమీకృత సాగు రైతు వాసికర్ల శేషు కుమార్, చండ్రా వెంకటేశ్వరరావు, శ్రీనాధ్ రెడ్డి, ఓరుగంటి రోజా, కొండల్ రావు, రమేష్, రైతులు, మిద్దె తోటల సాగుదారులు పాల్గొన్నారు.