calender_icon.png 2 November, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. కల్కి 2898ఏడీ

02-11-2025 12:51:21 AM

దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- (డీపీఐఎఫ్ ఎఫ్) 2025 వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి గానూ అవార్డులు ప్రదానం చేశారు.

ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటిగా కృతిసనన్ (చిత్రం: తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా ‘స్త్రీ2’, ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘కల్కి 2898ఏడీ’ అవార్డులు దక్కించుకున్నాయి. సినిమాలకే కాకుండా వెబ్‌సిరీస్‌లలోనూ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకూ పురస్కారాలు ప్రదానం చేశారు.