10 April, 2026 | 7:22 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

నవంబర్ 2న ఫైనల్

03-06-2025 12:00 AM

2025 మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ వేదికలు, తేదీలు ఖరారు

దుబాయ్, జూన్ 2: ఈ ఏడాది భారత్, శ్రీలంక వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు, తేదీలను ఐసీసీ సోమవారం ఖరారు చేసింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఐదు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), గుహవాటిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ కొలంబోలోని ప్రేమదాస మ్యా చ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ గుహవాటి లేదా కొలంబో, రెండో సెమీఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో జరగనుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్‌కు బెంగళూరు లేదా కొలంబో ఆతిథ్యమివ్వనుంది.