28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

కొత్త చాంపియన్ ఎవరో?

03-06-2025 12:00 AM

నేడు పంజాబ్, ఆర్సీబీ మధ్య ఐపీఎల్ ఫైనల్

అహ్మదాబాద్, జూన్ 2: రెండు నెలలుగా అభిమానులను అలరిస్తూ వచ్చిన ఐపీఎల్ 18వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో తలపడనున్నాయి. రెండు జట్లలో ఎవరు గెలిచినా తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను అందుకోనున్న నేపథ్యంలో కొత్త చాంపియన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది.

అయితే క్వాలిఫయర్ ఇదే పంజాబ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉండగా.. ఆర్బీబీ చేతిలో ఓడినప్పటికీ క్వాలిఫయర్ ముంబైని మట్టికరిపించిన పంజాబ్.. మరోసారి బెంగళూరుతో టైటిల్ ఫైట్‌కు సిద్ధమైంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో సమాన స్థాయిలో ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ రిజర్వ్ డే ఉండడం సానుకూలాంశం.