03-12-2025 01:14:37 AM
నాలుగు వరుసల రహదారికి నేడు సీఎం శంకుస్థాపన
కరింనగర్, డిసెంబర్2(విజయక్రాంతి): తెలంగాణలో మరో నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర మం త్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి సాధించిన కొత్తపల్లి- హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి పనులకు రాష్ట్ర ముక్షమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
హుస్నాబాద్-కొత్తపల్లి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. మొదటి దశగా ఈ రోడ్డు అభివృద్ధికి రూ. 77.20కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ జీవో జారీ చేశారు. రహదారి నిర్మా ణం పూర్తయితే పలు జిల్లాలకు వాహనదారులు ఎటువంటి ఆంటంకం లేకుండా దూ సుకెళ్లిపోవచ్చు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిలో కొత్తపల్లి (రాజీవ్ రహదారి) ప్రస్తుతం రెడు వరుసల రహదారి ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేదుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
రహదారి విస్తరణకు అనేకసార్లు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టినా.. స్పందించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. మెుదటి దశలో ఎండీఆర్ ప్లాన్ కింద ప్యాకేజీ-2లో రహదారిలో 11కి.మీ నుంచి 21కి.మీ వరకు 4 లైన్ నిర్మాణానికి రూ.77.20కోట్లకు మంజూరయ్య యా. ఈ రహదారి 4 లైన్లుగా మారితే.. హు స్నాబాద్ నుంచి కరీంనగర్ రవాణా సౌకర్యాలు మరింత మెరుగ వుతుంది. హుస్నా బాద్, కోహెడతో పాటు జనగాం, హనుమకొండ జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు.