19 March, 2026 | 12:43 AM

పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

18-03-2026 09:49 PM

ప్రముఖ సంఘసేవకులు అయిత పరంజ్యోతి

చేగుంట,(విజయక్రాంతి): ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయని, మన జీవితాల్లోనూ కొత్త ఆశలు,మంచి సంకల్పాలు ప్రారంభం కావాలని చేగుంట పట్టణ, ప్రముఖ సంఘ సేవకులు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి  ఆకాంక్షించారు.

నూతన తెలుగు సంవత్సరం లో ప్రజల కుటుంబాల్లో ఆర్థిక,ఆరోగ్య,సంతోషాలను నింపాలని, ఉగాది పచ్చడిలోని తెలుగు ప్రజల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని అయన ఆకాంక్షించారు.