calender_icon.png 3 December, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కలకలం

03-12-2025 08:51:27 AM

హైదరాబాద్: వేధింపుల ఆరోపణలో వార్డు ఎన్నికల్లో ఫోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రంగారెడ్డి జిల్లాలో(Rangareddy District) కంసాన్ పల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆవ శేఖర్ కంసాన్ పల్లి 4వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటో చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నామినేషన్ వేశాడు. గత నాలుగు రోజులుగా నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కొందరు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

ఫోటీ నుంచి తప్పుకోకపోతే ఆక్రమ కేసులు పెడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. షాద్ నగర్ శివారులోని సోలిపూర్ రైల్వే వంతెన(Solipur Railway Bridge) వద్ద శేఖర్ విగతజీవిగా పడిఉండడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని శేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. హత్యా? లేకు ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శేఖర్ మృతి పట్ల కంపాన్ పల్లిలో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ పై ఒత్తిడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని మద్దతుదారులు, కుటుంబసభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పలు జిల్లాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులను తమ నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు వస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు.