ఎట్టకేలకు వరుణుడి కరుణ!
12-09-2026 | 12:54pm
టేకులపల్లిలో భారీ వర్షం.. రైతుల్లో ఆనందం
టేకులపల్లి, (విజయక్రాంతి): వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులను శనివారం కురిసిన భారీ వర్షం(Heavy rain) ఉత్సాహపరిచింది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం నెలకొనగా, 11 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో టేకులపల్లి మండలవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
ఇటీవల వర్షాలు లేక పత్తి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మిరప నారు నాటేందుకు దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులకు బోర్ల నుంచి సైతం ఆశించిన స్థాయిలో నీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ తరుణంలో కురిసిన వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం మరికొంత కొనసాగితే పంటలకు మరింత ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.