24-02-2026 01:26:20 AM
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు సోమవారం ఉదయం స్వామివారిని గోవర్ధనగిరిధారి అలంకారంలో తిరువీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో కలెక్టర్ హనుమంత రావు, ఈవో భవానీశంకర్, ఆలయ వంశపారంపర్య చైర్మన్ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.