23 June, 2026 | 6:01 PM

ఆడబిడ్డ పెండ్లికి ఐదువేల ఆర్థిక సహాయం

23-06-2026 04:49 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని కోతీరాంపూర్ కి చెందిన ఆటో డ్రైవర్ భూక్యా లాలు కుమార్తె వెన్నెల వివాహాం ఈ నెల 25వ తేదీన జరుగనున్న సందర్బంగా విషయం తెలుసుకున్న నారదాసు వసంత రావు నేడు వారి ఇంటికి వెళ్లి 5016 రూపాయలను అందించారు. ఈ సందర్బంగా వసంత రావు మాట్లాడుతూ.. గత నెలలో ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల ఆడపిల్ల వివాహానికి 5000 రూపాయలను ప్రకటించిన విషయం విదితమే.

 ఈ సందర్భంగా కోతి రాంపూర్ కు చెందిన  భూక్య సత్తమ్మ లాలు దంపతుల కుమార్తె వివాహం నిశ్చయమైందని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి  5016 రూపాయలను వారికి అందించానన్నారు. ఆడబిడ్డ పెళ్లికి చిరు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ నగరానికి చెందిన ఎవరైనా ఆటో కార్మికులు తన కుమార్తె వివాహం చేస్తే తనను సంప్రదించి 5016 రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొందగలరని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఆటో డ్రైవర్ కూతురి వివాహానికి 5016 ఇచ్చిన నారదాసు వసంతరావు కు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు.