calender_icon.png 31 July, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశదిన కర్మలకు ఆర్థిక చేయూత

30-07-2025 07:30:51 PM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి..

మంగపేట (విజయక్రాంతి): మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు మద్దెల ప్రవీణ్ మాతృమూర్తి లక్ష్మి అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ కుంజా సూర్య చొరవతో గురువారం జరగబోవు దశదిన కర్మలకు రూ.30,000 లను మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి మద్దెల ప్రవీణ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్ర బాబు, జిల్లా ప్రచార కార్యదర్శి కోడం బాలకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమరం బాలన్న, మాజీ ఎంపీటీసీ కొమరం సారయ్య మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఎడ్ల నరేష్, కబ్బాక లక్ష్మన్, మూగల చంటి,కిరణ్, మురళి, మనోజ్, జిల్లా, మండల, గ్రామ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.