calender_icon.png 31 July, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం

30-07-2025 07:24:47 PM

కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం పేద విద్యార్థిని చదువు కోసం అవసరమైన ఫీజు చెల్లించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన దుంపెట నాగరాజు - రమ దంపతుల కుమార్తె దక్షిత మధ్యప్రదేశ్ లోని కత్నిలో గల ఆల్ ఇండియా సైనిక్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది.

7వ తరగతి కోసం రెండు లక్షల 50 వేలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉండగా, తమది పేద కుటుంబం అని, తమ కుమార్తె చదువుకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను విద్యార్థిని తల్లిదండ్రులు వేడుకున్నారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ విద్యార్థిని దక్షిత చదువు నిమిత్తం 1 లక్ష రూపాయల చెక్కును సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఛాంబర్ లో విద్యార్థిని తండ్రి నాగరాజుకు అందజేశారు. ఉన్నత చదువులు చదివేందుకు దక్షితకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు దక్షిత తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.