30-07-2025 07:36:25 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): ఆగస్టు 2022 నుండి జనవరి 2025 వరకు భర్తలను కోల్పోయిన స్త్రీలకు వితంతు పెన్షన్ కొత్త మంజూరు లేనందున వారికి ఆసరాగా కేంద్ర ప్రభుత్వం చేయూత నందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భర్తలను కోల్పోయిన మహిళలు 18-59 మధ్య వయసు కలిగి ఉండాలని దీని ద్వారా ద్వారా నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు అవుతాయన్నారు. మండల తహశీల్దార్ ఆఫీసులో సంబంధిత కాగితాలతో దరఖాస్తు చేసుకోవాలని, చేయూతనందించే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని మనోహరాబాద్ ఎంపీడీవో తెలిపారు.