తల్లిదండ్రులు లేని యువతి పెళ్లికి ఆర్థిక సాయం
09-05-2026 12:29 AM
సదాశివనగర్, మే 8 (విజయక్రాంతి):మండలంని ధర్మరావుపేట్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని యువతి వివాహానికి గ్రామ సర్పంచ్ ఉమర్ దుస్తులు,మట్టెలు అందించగా,గ్రామ ఎన్నారై సభ్యులు రూపాయలు 15000 గల పుస్తేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సామాజిక సేవే తమ లక్ష్యమని,ముఖ్యంగా పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.అవసరమున్న ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.






