మహిళా సాధికారతకు ఇందిరా మహిళాశక్తి భవనం వేదిక కావాలి
కామారెడ్డి, మే 8 (విజయ క్రాంతి): మహిళ సాధికారతకు ఇందిర మహిళా శక్తి భవనం వేదిక కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్లతో మంజూరు చేసిన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.
మే 25 లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ల ఆదేశించారు. భావన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అన్ని సౌకర్యాలతో పనులు పూర్తి చేయాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఉత్పత్తుల మార్కెటింగ్ లు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డి ఆర్ డి ఏ పిడి సురేందర్, డిపిఆర్‌ఈ దుర్గాప్రసాద్, పి ఆర్ డి ఈ ఈ స్వామిదాస్, డిపిఆర్‌ఓ తిరుమల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






