షోరూంలలో మెటల్ డిటెక్టర్లు, ఎమర్జెన్సీ అలారాలు తప్పనిసరి
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, మే 20 (విజయ క్రాంతి): బంగారు ఆభరణాల డిటెక్టర్లు, ఎమర్జెన్సీ అలారాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆ లం ఆదేశించారు. బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పలు బంగారు ఆభరణాల షోరూంలు, లా డ్జీలు, బస చేసే హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పా టు చేసుకోవాలని సిపి సూచించారు. షో రూంల ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మె టల్ డిటెక్టర్, లోపలికి వచ్చే వారిని తనిఖీ చేయడానికి హ్యాండ్ హెల్ మెటల్ డిటెక్టర్లను ఖచ్చితంగా ఉపయోగించాలని ఆదేశించా రు.
అత్యవసర సమయాల్లో అప్రమత్తం చే యడానికి దుకాణాల్లో పలు చోట్ల ’ఎమర్జెన్సీ అలారమ్స్’ అమర్చాలని, వాటిని నొక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందేలా అధునాతన సాంకేతికతను అనుసంధానం చేసుకోవాలన్నారు. హోటళ్లలో రూమ్ లు అద్దెకు ఇచ్చే సమయంలో కస్టమర్ల నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను సేకరించాలన్నారు. వా రు ఇచ్చే ఫోన్ నంబర్లను క్రాస్ చెక్ చేసుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కని పిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అం దించాలన్నారు.
అన్ని వ్యాపార సముదాయాలు, హోటళ్లలో సీసీ కెమెరాలు నిరం తరం పనిచేసేలా చూసుకోవాలని, వాటి విజువల్స్ స్పష్టంగా ఉండేలా బ్యాకప్ సా మర్థ్యం సరిగ్గా ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటార ని, వ్యాపార సంస్థల నిర్వాహకులు పోలీసు ల నిబంధనలకు లోబడి వ్యాపారాలు నిర్వహించి, నగర భద్రతలో భాగస్వాములు కా వాలని పిలుపునిచ్చారు. భద్రతా ప్రమాణా ల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్య లు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీసీపీ వెంకటరమ ణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






