25 May, 2026 | 3:56 AM

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

25-05-2026 02:02 AM

అలంపూర్, మే 24: వాళ్లంతా చిన్నప్పుడు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్నారు. సహచర  మిత్రుడిని కోల్పోయిన కుటుంబానికి కష్టసుఖాల్లో మీకు మేమున్నామని భరోసా కల్పించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2008 -09 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన సహచర మిత్రుడు రమేష్ గత నెల 15న బెంగుళూరు నుంచి తమ  స్వగ్రామం అయిజ మండలం ఉప్పలకు వస్తూ రైలు ప్రమాదంలో అకాల మరణం చెందారు.

మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని అందుకు సహచర మిత్రులంతా కలిసి రూ.51 నగదును సేకరించారు. వారంతా ఆదివారం ఉప్పల గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు సేకరించిన నగదును అందజేశారు. మిత్రుడు రమేష్ మా మధ్య లేకపోయినా మీకు మేము అండగా ఉన్నాం అన్న భరోసాను ఆ కుటుంబానికి కల్పించి వారి కళ్ళల్లో వెలుగులు నింపారు. ఈ కార్యక్రమంలో అల్వాలపాడు దాసు, ధరూర్ రవి, డాక్టర్ తిమ్మప్ప, గోవర్ధన్, మహేష్ నరసింహులు, పాగుంట శ్రీను జయరాజ్, శ్రీనివాస్ మహారాజ్ సంజీవ్, తిరుమల్, వీరేష్ పాల్గొన్నారు.