నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
13-08-2026 02:19 PM
నంగునూరు, (విజయక్రాంతి): నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఏర్పుల యాదయ్య అనారోగ్యంతో మృతి చెందరు. విషయం తెలుస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్,మాజీ వైస్ ఎంపీపీ రేణుక వేణుగోపాల్ చారి,వార్డు సభ్యులు నోముల రవీందర్, కర్రె సంపతి కుమార్,బాబు,సీనియర్ నాయకులు జయరాములు,వీర్యానాయక్, మాధవరెడ్డి,సత్తయ్య,చింటూ గౌడ్ తదితరులు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.






