19 April, 2026 | 6:04 PM

ఇరిగి బొందయ్య కుటుంబానికి ఆర్ధిక సహాయం

19-04-2026 04:55 PM

దేవరకొండ,(విజయక్రాంతి): చింతకుంట్ల గ్రామానికి చెందిన ఇరిగి బొందయ్య శనివారం మరణించారు అని తెలుసుకున్న  మృతికి ప్రగాఢ సంతాపం తెలిపి, బొందయ్య కొడుకు ఇరిగి నాగేష్ కు 30,000/-దూదిపాల శ్రీనివాస్ రెడ్డి, దూదిపాల వేణుధర్ రెడ్డి  ఆర్థిక సహాయం చేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బొందయ్య  తన చివరి శ్వాస వరకు ట్రాక్టర్ డ్రైవర్ వృత్తిని జీవనాధారంగా చేసుకొని కుటుంబం కోసం పాటు పడ్డారని డాక్టర్ వేణుధర్ రెడ్డి  గుర్తు చేశారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దాసరి బాలకృష్ణ, వార్డు మెంబర్ కలగోని రమేష్, శవ్వ మదార్,ఎదుళ్ళ ఎల్లయ్య, ఎదుళ్ళ కృష్ణయ్య, ఎదుళ్ళ యేసయ్య, ఎదుళ్ళ గోవింద్, పంది నాగేష్, ఎదుళ్ళ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.