19 April, 2026 | 6:20 PM

చిరు వ్యాపారులకు అండగా నిలిచిన మంత్రి తుమ్మల

19-04-2026 04:57 PM

షాపులు కొల్పోయిన బాధితులకు నూతన షాపులు కేటాయింపు

 పత్రాలను పంపిణి చేసిన మేయర్ నీరజ, యుగేందర్

ఖమ్మం,(విజయక్రాంతి): స్టేషన్ రోడ్డులో గత కొద్ది సంవత్సరాలుగా షాపులను నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండగ నిలిచారు.  ఖమ్మం నగరంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో 46,47 లో డివిజన్లకు సంబందించిన షాపింగ్ కాంప్లెక్స్ ని కోల్పోయిన చిరు వ్యాపారులకు నూతన షాపులను కేటాయించారు. ఖమ్మం నగరంలో నూతనంగా రూ.2 కోట్లతో నిర్మించిన 66 నూతన షాప్స్ కు సంబందించిన పత్రాలను ఆదివారం మంత్రి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో వ్యాపారులకు  జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్,  ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ అందజేశారు. 

వ్యాపారం చేసుకుని రోజు  జీవనం సాగించే  చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల  నాగేశ్వరరావు ఇచ్చిన మాట ప్రకారం అతి కొద్దికాలంలోనే బాధితులకు పత్రాలను అందజేశారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మేయర్ నీరజ కొనియాడారు.‌ దీంతో చిరు వ్యాపారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ మంత్రి తుమ్మలసారధ్యంలో ఖమ్మం నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది.

దానిలో భాగంగానే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, వరదలు నుండి ప్రజలను కాపాడం కోసం మున్నేరు రిటైలింగ్ వాల్ నిర్మాణం, ఖిల్లా రూప్ వే,ఖమ్మం నూతన వ్యవసాయ మార్కెట్ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఖమ్మం నగరాన్ని నెం 1 సిటీగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు,నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి,కాంగ్రెస్ పార్టీ నాయకులు నాళం సతీష్ , మహమ్మద్ అశ్రీఫ్ , తదితరులు పాల్గొన్నారు.