రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థికసాయం
11-06-2024 12:54 PM
రాజన్న సిరిసిల్ల, విజయక్రాంతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి వేములవాడకు చెందిన మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.33 వేల ఆర్థిక సాయం అందించారు. వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయిపల్లి గ్రామానికి చెందిన ఏరెళ్లి సాయి కుమార్ గత పది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. అతడికి ఆపరేషన్ నిమిత్తం ‘మన చారిటబుల్‘ ట్రస్ట్ సభ్యులు మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు రూ.33 వేలు అందించారు.






