6 July, 2026 | 5:34 AM

రైలు ప్రమాదంలో తెగిపడిన వ్యక్తి కాలు

11-06-2024 12:59 PM

ఆదిలాబాద్, విజయక్రాంతి: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి కాలు పూర్తిగా తెగిపడిపోయింది. మహాలక్ష్మి వాడకు చెందిన అమృత్ అనే వ్యక్తి మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఎడమ కాలు తెగిపడిపోయింది. వెంటనే స్థానికులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న వాహన సిబ్బంది. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని రిమ్స్ కు తరలించారు.