నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేయాలి...
మంత్రి సీతక్క ను కలిసిన జెడ్పి చైర్ పర్సన్ సరిత
గద్వాల (వనపర్తి ), విజయక్రాంతి : నియోజకవర్గ అభివృద్ధి కి తమ వంతు సహకారాన్ని అందించదంతో పాటు కృషి చేయాలనీ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ను జెడ్పి చైర్ పర్సన్ సరిత కోరారు. సోమవారం రాత్రి డాక్టర్ బి .ఆర్ .అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... నియోజకవర్గం లో గల పలు గ్రామపంచాయతీ లో గల పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధి కి దృష్టి నిధులను మంజూరు చేసేలా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి పంచాయతీ రోడ్ల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేసేలా కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.






