calender_icon.png 20 February, 2026 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

20-02-2026 05:47:47 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన వానరాశి శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ ఉపసర్పంచ్  పెద్దూరి తిరుపతి పరామర్శించారు. నిన్న ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలిపోవడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పెద్దూరి తిరుపతి బాధిత కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించి, వారికి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, డైరెక్టర్ ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, రెడ్డి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు.