30 July, 2026 | 1:44 AM

హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ, సీఈవోకు జరిమానా!

30-07-2026 12:49 AM
  1. ఎంఎస్‌ఆర్డీసీ వ్యవహారంపై మరికొందరికి ఫైన్ 
  2. బ్యాంకు చైర్మన్ నేతృత్వంలో బోర్డు 

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్డీసీ) నుంచి డిపాజిట్లను సమీకరించేందుకు 2017, 2021లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేసుకున్న ఏర్పాట్ల పై నిర్వహించిన అంతర్గత సమీక్ష అనంతరం బ్యాంకు బోర్డు కీలక చర్యలు చేపట్టింది. బ్యాంకు ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆ ఫీసర్ శ్రీనివాసన్ వైద్యనాథన్, రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవిం ద్ వోహ్రాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.

వీరితో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరికొందరు ఉద్యోగులకు హెచ్చరిక లేఖలు జారీ చేసింది. కొత్త పార్ట్‌టైం చైర్మన్ రాజీవ్ కుమార్ ని యామకం తర్వాత హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు బోర్డు తీసుకున్న తొలి ప్రధాన నిర్ణయం ఇదే కావడం విశేషం. ప్ర స్తుత పదవీకాలం అక్టోబరులో ముగియనున్న శశిధర్ జగదీశ్‌ను మరోసారి సీఈవోగా నియమించాలా వద్దా అనే అంశాన్ని బోర్డు పరిశీలిస్తున్న స మయంలోనే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ తరహాలో చర్యలు తీసుకోవడం భారత కార్పొరేట్ రంగంలో అత్యంత అరుదైన విషయమని కార్పొరేట్ వ్యవహారంపై అవగాహన ఉన్న వ ర్గాలు పేర్కొంటున్నాయి. ఒక భారతీయ కంపెనీ బోర్డు, పదవిలో కొనసాగుతున్న తన సీఈవోపైనే వ్యక్తిగతంగా జరిమానా విధించిన సందర్భాలు గతంలో లేవని చెబుతున్నాయి.