calender_icon.png 14 September, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరో స్థానంతో ముగింపు

11-12-2024 12:00:00 AM

ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మంగళవారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన పోరులో భారత్ 30 తేడాతో చైనా చేతిలో ఓటమి చవిచూసింది. ఇక ఫైనల్లో దక్షిణ కొరియాను 24 చిత్తు చేసిన జపాన్ చాంపియన్‌గా అవతరించింది.

ఈ విజయంతో వరుసగా ఏడుసార్లు ఆసియా చాంపియన్‌షిప్ నెగ్గిన దక్షిణ కొరియా రికార్డుకు బ్రేక పడింది. ఇక కజకిస్థాన్, ఇరాన్ వరుసగా మూడు, నాలుగో స్థానంలో నిలిచాయి. అంతేకాదు వచ్చే ఏడాది జర్మనీ, నెదర్లాండ్స్‌లో జరగనున్న ఐహెచ్‌ఎఫ్ మహిళల వరల్డ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు జపాన్, సౌత్ కొరియా, కజకిస్థాన్, ఇరాన్  నేరుగా అర్హత సాధించాయి.