11-12-2024 12:00:00 AM
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టోర్నీ
సింగపూర్: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న 13వ గేమ్‌లో గెలుపు విజేతను నిర్ణయించే అవకాశముంది. 12 గేములు ముగియగా గుకేశ్, లిరెన్ చెరో రెండింటిలో గెలిచి 6 సమానంగా ఉన్నారు.
టైటిల్ విజేతకు 7.5 పాయింట్లు అవసరం కాగా.. ఇద్దరిలో ఎవరు ఆ పాయింట్లు సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి గేమ్ లిరెన్ గెలవగా.. మూడో గేమ్ గుకేశ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఏడు గేములు డ్రా అయ్యాయి. 11వ గేమ్ మళ్లీ గుకేశ్ నెగ్గి ఆధిక్యంలోకి రాగా.. 12వ గేమ్ గెలిచిన లిరెన్ ఆధిక్యాన్ని సమం చేశాడు.