ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటోలతో రీల్స్ వైరల్.. కేసు నమోదు
31-07-2026 10:46 AM
మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు
ప్రధాని 'మార్ఫ్' చేసిన రీల్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)పై అభ్యంతర పోస్టులు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మార్ఫింగ్ ఫోటోలతో రీల్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా నేతలు(BJP social media leaders) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీపై రీల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను బీజేపీ కోరింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ , మెటా ఇండియా హెడ్స్, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చారు.






