పాత పాల్వంచలో దొంగల హల్ చల్
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచలో గురువారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. పాత పాల్వంచ ప్రధాన రహదారిలో గల ఒక ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని అపహరించి, సాయినగర్లో వదిలివేసి, ద్విచక్ర వాహనాన్ని పాక్షికంగా తీసుకుని ధ్వంసం చేశారు. అదే రోజు రాత్రి గడియకట్ట లోని శంకర్ రెడ్డి ఇంట్లో దొంగతనం చేసి సుమారు 5 తులాల బంగారాన్ని అపహరించారు. ఇంటి యజమానులు వెనక రూములో నిద్రిస్తున్న సమయంలో ముందు రూము తలుపులు పగలగొట్టి బీరువా తెరచి వస్తువులను చిందరవందరగా పడవేసి 5 తులాల బంగారాన్ని అపహరించారు. సుమారు 15 రోజుల క్రితం పాత పాల్వంచ నుంచి బంగారుజాలు వెళ్లే మార్గంలో వరి పొలంలోని విద్యుత్ మోటార్ను చోరీ చేశారు. దీంతో పాత పాల్వంచ ప్రజలు భయాందోళన గురవుతున్నారు. పోలీసు గస్తే పెంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.






