బాలాజీ హాస్పిటల్ లో లింగ నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రి సీజ్
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు..
డిఎంహెచ్వో, డాక్టర్ వెంకటరమణ
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని శ్రీ బాలాజీ హాస్పిటల్(Sri Balaji Hospital)లో అనుమతి లేకుండా గర్భిణీకి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో డిఎంహెచ్వో డాక్టర్ పి వెంకటరమణ, పి.సి.పి.ఎన్డిటి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎండి నజియా తబస్సుమీ వైద్య సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో స్కానింగ్ యంత్రం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి అనుమతి గడువు తీరిన రెన్యువల్ చేయకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆసుపత్రిని సిహెచ్సిసి నిర్వాహకుడి సతీష్ పై కేసు నమోదు చేయాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దవాఖానాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.






