31 July, 2026 | 11:36 AM

జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

31-07-2026 11:03 AM

17 గేట్లు ఎత్తి నీటి విడుదల

వనపర్తి (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు(Jurala project) వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 17 గేట్లను ఎత్తి 1,05,198 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా, ప్రస్తుతం 1,041.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.068 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఎగువ వైపు 6 యూనిట్లు, దిగువ వైపు 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.