7 May, 2026 | 3:14 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

21-04-2025 09:11 AM

కేవశ్ పురం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

కర్మాగారంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

14 అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కేశవ్ పురం(Keshav Puram) ప్రాంతంలోని ఒక కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. ఆ కర్మాగారం లారెన్స్ రోడ్డులో ఉంది. స్థానికుల సమాచారం అందిన తర్వాత 14 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సీనియర్ అధికారులు కూడా మంటలు చెలరేగిన ప్రదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. వీడియోలో, నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం కనిపించింది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా  ఆస్తి నష్టం అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.