2 June, 2026 | 2:43 AM

భోలక్‌పూర్‌లో అగ్నిప్రమాదం

02-06-2026 12:00 AM

తప్పిన పెను ప్రమాదం

ముషీరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ బంగ్లాదేశ్ మార్కెట్ సమీపంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ చెత్తా చెదారం ఉండడంతో ప్రమాదవశాత్తు చెత్తకు మంటలు అంటుకొని ట్రాన్స్ ఫార్మర్ కు వ్యాపించాయి. ట్రాన్స్ ఫార్మర్ కు సైతం మంటలు విస్తరించడంతో స్థానికులు భయాం దోళనకు గురయ్యారు. వెంటనే ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ ను తొలగించారు.

అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ లో మంటలు వ్యాపించకుండా వాటిని తొలగించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో వంద మీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని  తీవ్ర ఆందోళనకు గురయ్యారు.