జిన్నారంలో అగ్నిప్రమాదం
27-05-2024 04:46 PM
జిన్నారం: సంగారెడ్డి జిన్నారం మండలం గడ్డపోతారంలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ల్యాబ్ లోని సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






