2 August, 2026 | 2:36 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి కలకలం

27-05-2024 05:03 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి కలకలం రేగింది. రైల్వే స్టేషన్ లో 62 కిలోల గంజాయి పట్టుబడింది. రూ.15 లక్షలు విలువైన గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్ కు రైళ్లల్లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.