4 May, 2026 | 9:53 AM

స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

28-11-2024 09:35 AM

హైదరాబాద్: కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని మొగల్ కానాల వద్ద ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి సమయంలో రెండు ఫైరింజర్లు ఘటనస్థలానికి చేరుకొని మంటలను అతికిష్టం మీద అదుపు చేశాయి. ఈ ప్రాంతంలో భారీగా ప్లాస్టిక్ గోదాములు, స్క్రాప్ గోడౌన్లు ఉండటంతో  ప్రమాదకరంగా మారాయి.