4 May, 2026 | 11:08 AM

పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఖాజీపల్లి పారిశ్రామికవాడలో ఘటన

28-11-2024 09:19 AM

పటాన్ చెరు, విజయక్రాంతి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారు జామున 4:30 ప్రాంతంలో రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు, పరిశ్రమ యాజమాన్యం ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. పటాన్ చెరు, జీడిమెట్ల, నర్సాపూర్ నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి  పోలీస్ సిబ్బందితో కలిసి పరిశ్రమను పరిశీలించారు.