7 May, 2026 | 5:48 PM

సెలూన్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు యువతులకు అస్వస్థత

23-06-2024 02:44 PM

సుచిత్ర: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సుచిత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సెలూన్ లో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. మంటలు కాస్త పైఅంతస్తుకు వ్యాపించడంతో  ముగ్గురు యువతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.