07-07-2025 08:46:08 AM
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఘజియాబాద్‌లోని(Ghaziabad) పేపర్ ఫ్యాక్టరీలో(Paper Factory) సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ సిబ్బంది సమాచారంతో హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.