calender_icon.png 7 July, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు

07-07-2025 12:48:13 PM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): పేదల  సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(State Government) పని చేస్తోందని త రాష్ట్రాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukender Reddy) తెలిపారు. సోమవారం నల్గొండ క్యాంపు కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన (23,38,000 రూపాయల) చెక్ లను అందచేసి మాట్లాడారు.  పేదల  సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర సీఎం ఆర్ ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ  పథకం ద్వారా పెదప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.