07-07-2025 01:29:09 PM
అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి(Sub Registrar Office Abdullahpur) ఆ బిల్డింగ్ యాజమాని తాళం పెట్టాడు. 2007 నుంచి కొనసాగుతున్న సబ్ రిజిస్టార్ కార్యాలయం. గతంలో కూడా రెంటు చెల్లించకపోవడంతో.. తాళాలు వేసి ఆందోళనలో తెలపడంతో రెంట్ చెల్లించినట్లు బిల్డింగ్ యాజమానీ తెలిపాడు. ప్రతినెల రూ 12000 చెల్లించాల్సి ఉంటుంది. గత 40 నెలల నుండి రెంటు కట్టకపోవడంతో సోమవారం ఆఫీస్ ఓపెన్ చేసే సమయంలో తలాలతో వచ్చిన ఓనర్ ఆఫీస్ డోర్లకు తాళం పెట్టాడు. దీంతో విధులకు వచ్చిన సిబ్బంది అధికారులు, రిజిస్టేషన్ కోసం వచ్చిన జనం కార్యాలయం బయటే పడికాపులు కస్తున్నారు.
అయితే తాను గత 15ఏళ్ళు క్రితం తన బిల్డింగ్ ను అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి రెంటుకు ఇచ్చానని గత 40నెలలుగా రెంటు చెల్లించడం లేదని ఓనర్ చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని జిల్లా స్థాయి అధికారుల దృషికి తీసుకెళ్లిన వారు కూడా స్పందించకపోవడంతో తాళం పెట్టానని చెప్పాడు. ఇంతలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అక్కడికి చేరుకొని సదరు బిల్డింగ్ యజమానిని స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ విషయమై సబ్ రిజిస్టార్ సునీత రాణి వివరణ కోరగా తాము కార్యాలయంకు వచ్చే లోపు తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారాన్ని ఇచ్చామని తెలిపారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.