calender_icon.png 7 July, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక మొహరం

07-07-2025 12:43:36 PM

చేగుంట, విజయక్రాంతి: చేగుంట మండల కేంద్రంలో ఘనంగా మొహరం(Moharram) వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ... మొహరం పండుగ త్యాగానికి,పతిక అని, మహమ్మద్ ప్రవక్త మనవళ్లు, ఇమామే హసేన్, ఇమామే హుస్సేన్, విరోచిత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ మొహరమని అన్నారు, మొహరం పండుగ ఇస్లామిక్, క్యాలెండర్ లో మొదటి నెలలో హిందూ ముస్లిం, కలిసి జరుపుకునే పండుగ అని, కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్,అతని అనుచరుల  మరణాన్ని  గుర్తు చేసుకునే పండగ  మొహరం పండుగ(Muharram Festival). కేవలం ముస్లింలకు, మాత్రం కాకుండా, ఇతర మతాల,  కలుసుకుని జరుపుకున్న ముఖ్యమైన సంస్కృతిగా  పండుగ అని అన్నారు.

మొహరం రోజున పీర్లలను ఉదయం డబ్బులతో గ్రామంలో, విధుల్లో కుండా, ఊరేగింపుగా తీసుకెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో భక్తులు,తమ విశ్వాసాన్ని,చాటుకోవడానికి, ఒళ్ళు కోసుకోవడం, కోరడలతో కొట్టుకోవడం, వంటి ఆచారాలు కూడా పాటిస్తారు అని అన్నారు. మండలం ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన్ జరగకుండా చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ,  మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ అలీ, షాబిల్,అలీ, అహ్మద్ అలీ, అజ్గర్ అలీ, జాఫర్, సాహెబ్, గౌస్, వాజిద్, సర్వర్, రఫీక్, సద్దాం, జానీ, షరీఫ్, బాబా, తదితరులు పాల్గొన్నారు