calender_icon.png 9 February, 2026 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ టు జెడ్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

09-02-2026 07:31:10 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డు భవాని నగర్ లోని ఏ టు జెడ్ డయాగ్నస్టిక్ సెంటర్ సెంటర్లో సోమవారం ఉదయం 11:30 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెడరేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నామని సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.