పెద్దమల్లారెడ్డిలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
భిక్కనూర్, జూన్ 16(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, సదాశివనగర్ సీఎఫ్‌ఎల్ ద్వారా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాలు, నామినీ, కేవైసీ, బ్యాంకింగ్ సేవలు, లోన్ యాప్ మోసాలు, బీమా పథకాలు, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్‌లపై అవగాహన కల్పించారు.
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాల ప్రాధాన్యతను వివరించారు. గ్రామ సర్పంచ్ సాయగౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకుల ద్వారా బీమా పథకాలలో చేరాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు ఆనంద్ రెడ్డి, ప్రశాంత్, సర్పంచ్ సాయగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.






