16 June, 2026 | 1:43 PM

ఏసీబీ దాడుల్లో నరహరి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం

16-06-2026 12:38 PM

ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో రూ.1.10 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి(Deputy Director Narahari) నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. నరహరి నివాసం, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు(ACB Raids) నిర్వహిస్తున్నారు. నరహరి ఇళ్లు, బంధువుల ఇళ్లు సహా 12 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు నరహరి ఇంట్లో పడకగదిలో బెడ్ కింద భారీగా నోట్ల కట్టలు గుర్తించారు.

పడకగదిలో బెడ్ కింద భారీ మొత్తంలో నగదు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

నరహరి ఇంట్లో రూ. 1.10 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సుంకరి నరహరి, సోదరుడి ఇళ్లలో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నరహరికి హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాంట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయభూమి ఉన్నట్లు గుర్తించారు. 

అవినీతి నిరోధక శాఖ దాడులు, రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్ ను ఫాలో అవ్వండి.

నరహరి ఇంట్లో ఏసీబీకి ఏమి దొరికింది?

ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, పలు ఆస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం.

FAQ's

1. ఏసీబీ దాడులు ఎక్కడ జరిగాయి?
డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసం, కార్యాలయం సహా 12 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

2. ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారు?
ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

3. ఏ కేసులో ఈ దాడులు జరిగాయి?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా దాడులు నిర్వహించారు.

4. నగదు ఎక్కడ లభించింది?
నరహరి ఇంట్లోని పడకగదిలో బెడ్ కింద నగదు కట్టలను అధికారులు గుర్తించారు.

5. మరే ఇతర ఆస్తులు గుర్తించారా?
బంగారం, వెండి ఆభరణాలు, ఆస్తి పత్రాలు, భూములకు సంబంధించిన వివరాలు కూడా గుర్తించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్, అధికారుల దాడులు, ముఖ్య ఘటనల కోసం హైదరాబాద్ వార్తలు విభాగాన్ని సందర్శించండి.