జీడిమెట్లలో అగ్నిప్రమాదం
16-06-2026 11:26 AM
హైదరాబాద్: జీడిమెట్ల(Jeedimetla) పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఖాళీ స్థలంలో వేసిన పాత రియాక్టర్లు పేలి వసంత కెమికల్స్ కంపెనీలో(Vasantha Chemicals Company) మంటలు అంటుకున్నాయి. మంటలు, పొగలు ధాటికి కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు పెట్టారు. కంపెనీ సిబ్బంది ఫైర్ సిలిండర్స్, నీళ్లతో మంటలను ఆర్పుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






